వేడినీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను వేడి నీళ్లు తాగి తగ్గించుకోవచ్చు. గొంతు సమస్యలుంటే వేడినీళ్లు తాగటం ఎంతో మంచిది. వైరస్లు, ప్రమాదకర బ్యాక్టీరియాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా వేడినీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.