జర్మనీలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జర్మనీలో విదేశీయుల శాశ్వత నివాస అనుమతి ప్రక్రియను సులభతరం చేసింది. కొత్త రెసిడెన్సీ బిల్లుకు ఆమోదం తెలిపిన జర్మనీ ప్రభుత్వం.. 2022 జనవరి 1 నాటికి ఎవరైతే ఆ దేశంలో ఐదేళ్లుగా ఉంటున్నారో వారు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ లెక్కన గత ఐదేళ్ల నుంచి జర్మనీలో 1.36 లక్షల మంది ఉంటున్నట్లు తెలిపింది.