రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జి . నివాస్ మరియు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమీషనర్ డా . వినోద్ కుమార్ సెక్రటరియేట్ నుండి వీడియోకాన్ఫెరెన్స్ నిర్వహించి సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు . కృష్ణా జిల్లా, జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ ( ఇన్ - ఛార్జి ) మహేష్ కుమార్ రవిరాల కలెక్టరేట్ నుండి ఈ వీడియోకాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు . వచ్చే ఆగస్టు 20లోపు 13వ నోటిఫికేషన్ జారీ చేసి భూముల రీ - సర్వే పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ ( ఇన్ - ఛార్జి ) మహేష్ కుమార్ రవిరాల నివేదించారు . గురువారం జిల్లా కలెక్టర్లతో సి . సి . ఎల్ . ఏ . కార్యాలయం నుండి సి . సి . ఎల్ . ఏ . కమీషనర్ జి . సాయి ప్రసాద్ నిర్వహించిన వీడియోకాన్ఫెరెన్స్ లో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.