మహారాష్ట్రలోని పుణెలో వెల్డింగ్ షాపులో ఆడుకుంటున్న ఓ బాలుడిపై ఓ మెషిన్ పడింది. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. యువన్ అనే ఐదేళ్ల బాలుడు తన తల్లితో కలిసి కారు వాటర్ సర్వీసింగ్ కు వెళ్లాడు. పక్కనే ఉన్న ఓ ఇనుప మెషిన్ తో ఆడుతుండగా ఒక్కసారిగా అది మీద పడిపోయింది. బాలుడి తల్లి వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
ఈ ఘటన పింప్రీ చించవడ్ లో జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఆధారంగా ఈ ఘటన ఈ నెల 5న జరిగినట్లు తెలుస్తోంది.