తమిళనాడు కడలూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదివే విద్యార్థిని (15)పై సామూహిక అత్యాచారం జరిగింది. ప్లస్ టూ చదివే ఓ విద్యార్థిని బర్త్డే పార్టీకీ బాధితురాలు జులై 1న వెళ్లింది. ఆమెను తోటి విద్యార్థులు ముగ్గురు గదిలోకి లాగి, సామూహిక అత్యాచారం చేశారు. దీనిని వీడియో తీసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో గురువారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.