హిందువుల మనోభావాలను గౌరవించాలని ముస్లిం సోదరులకు ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ బక్రీద్ పిలుపునిచ్చారు. ఈద్ ఉల్ అదా రోజున ఆవులను చంపవద్దని అన్నారు. గురువారం గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ ఈద్ పండుగను హిందువులతో కలిసి జరపుకుంటామని అజ్మల్ తెలిపారు. తమ పూర్వీకులంతా హిందువులేనని, తర్వాత రోజుల్లో వారు ఇస్లాం మతాన్ని స్వీకరించారని చెప్పారు.