బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఆయన కుమారుడు తేజస్వీయాదవ్ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగాహనాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. కుటుంబసభ్యులతో మాట్లాడారని, కేవలం పడుకున్నప్పుడు మాత్రమే డాక్టర్లు ఆక్సిజన్ సపోర్టు ఇస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే అవకాశం ఉందన్నారు.