వర్షాకాలం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు వంటకు ఉపయోగపడడమే కాకుండా.. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పసుపు, దాల్చినచెక్క, మిరియాలు, లవంగాలు రోజు ఉపయోగిస్తే.. వర్షాకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. ఇవి జీవక్రియను పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి.