తల్లి మృతదేహాన్ని ఇంట్లో ఉంచి కుమారుడు పెళ్లి చేసుకున్న ఘటన ఝూర్ఖండ్లో జరిగింది. జూలై 10న కొడుకు వివాహం జరగాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యంతో గురువారమే మరణించింది. మృతురాలి చివరి కోరిక తన కుమారుడి పెళ్లి చేయడమే.
ఈ నేపథ్యంలో తల్లి ఆఖరి కోరికను తీర్చేందుకు కొడుకు ఓం కుమార్ సిద్ధమయ్యాడు. గుడిలో సరోజ్ అను యువతిని పెళ్లి చేసుకుని వచ్చి తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa