బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా చెబుతుంటారు. బక్రీద్ పండుగ ఏ రోజు ఆరోగ్యకరమైన పొట్టేళ్లను కోసి మాంసాన్ని పేదవాళ్లకు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తప్పకుండా ప్రతి ఏడాది కుర్బాని ఇవ్వాలి. బక్రీద్ పండుగ రోజు విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ పండుగ వెనుక పూర్వీకుల విశేష గాధ ఉంది. దైవ సంభూతుడైన ఇబ్రహీం సల్లెల్లాహు సల్లం భగవంతుడు పెట్టిన పరీక్షలో ఈ పరీక్ష ఒకటి ఉంది. ఇబ్రహీం సల్లల్లాహు సల్లం నిబద్ధతను పరీక్షించడానికి అల్లాహ్ ఒక రోజు కలలోకి వచ్చి ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ ను బలి ఇవ్వమని కోరుతారు. నిజాయితీ నిబద్ధత ప్రతీకగా నిలిచే ఇబ్రహీం సల్లెల్లాహు సల్లం ఉదయాన్నే కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు.
ఏకైక అల్లారుముద్దుగా పెంచుకునే కుమారున్ని దైవాజ్ఞ ప్రకారం మెడపై కత్తి పెట్టి వేయడానికి సిద్ధమవుతుండగా కత్తి వంకర్లు పోతుంది ఆకాశం నుండి అల్లాహ్ దీవెనలు వెళ్ళు అవుతూ నీ నిబద్ధతను పరీక్షించడానికి ఈ సవాలును అడిగానని కన్న కుమారునికి కూడా బలి ఇవ్వడానికి సిద్ధమైన అంటే నీ నిబద్ధత చాలా గొప్పదని ప్రశంసించి ఆకాశం నుండి పొట్టేలును ఖుర్బానీఇవ్వమని భూలోకానికి అల్ల పంపుతారు. నాటినుండి బక్రీద్ పండుగ ప్రారంభమైంది. పూర్తి ఆరోగ్యకరమైన పొట్టేళ్లను కోసి మాంసాన్ని పేద వాళ్లకి పంపడం ఆనవాయితీగా వస్తుంది. బక్రీద్ రోజున అల్లా పేరా బలిచ్చిన జంతు మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఒక భాగాన్ని ఖుర్బానీ ఇస్తున్న వారు, రెండో భాగాన్ని తమ బంధువులకు మూడో భాగాన్ని పేద ముస్లిం లకు దానం చేస్తారు.
నేటి నుండి ఈ మాసంలో ఎప్పుడైనను ఖుర్బానీ ఇవ్వచ్చు. నాడు పేదవాళ్ళు ఏడాదికి ఒకసారి కూడా మాంసం తినే వారు కాదు. పెద్దవాళ్లు పండుగ రోజు సంతోషంగా మాంసంతో భోజనం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకే బక్రీద్ వస్తుందంటేనే పొట్టేళ్ల కు బాగా డిమాండ్ ఉంటుంది. గత ఏడాది కోవిడ్ కేసుల కారణంగా ముస్లిం సోదరులు బక్రీద్ నామమాత్రంగా జరుపుకున్నారు. ఏడాది లాక్ డౌన్ ఎత్తి వేయడం తోపాటు కరోనా తీవ్రత తగ్గడంతో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముస్లింల సిద్ధమయ్యారు వారం రోజుల ముందు నుంచే గొర్రెలు మేకల తో పాటు కొత్త బట్టలు పండుగ సామాగ్రి కొనుగోలు చేశారు. ప్రార్థనలకు మసీదులను ఈగలను ముస్తాబు చేశారు. ఏది ఏమైనా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ ఆనవాయితీగా వస్తుంది.