యూపీలోని ఎటావా జిల్లా భర్తనా పట్టణానికి చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. మూహుర్తం ఫిక్స్ చేసి, అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరికి వివాహం జరగుతుండగా.. తనకు ఈ పెళ్లి వద్దంటూ వధువు షాకిచ్చింది. పెళ్లి చూపుల సమయంలో చూసిన వ్యక్తి ఇతను కాదని పెళ్లి పీటలపై పెళ్లిని ఆపేసింది. ఆమెకు అంతా సర్ధి చెప్పాలని ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.