సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎముకల బలానికి నిద్ర చాలా అవసరం. నిద్రలేమితో అలసటగా ఉండడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు తలెత్తుతాయి. సరిగా నిద్రపోని వారిలో ముఖ్యంగా మహిళలకు ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 8 గంటల నిద్ర లేకుంటే మహిళల్లో చురుకుదనాన్ని కోల్పోయి బలహీనంగా మారుతారని నిపుణులు సూచిస్తున్నారు.