తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వేళ విద్యుత్ వైర్లు,స్థంభాలను తాకరాదు. వైర్లు తెగినా మరియు ఇతర సమస్యలుంటే అధికారులకు సమాచారమివ్వాలి. విషసర్పాలు తిరుగుతుంటాయి కావున చెత్త ఉండకుండా చూసుకోవాలి. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. వైర్ల పై బట్టలు ఆరేయవద్దు. బట్టలు ఆరేసే దండాలు దేనికైనా తాకుతున్నాయోమో గమనించుకోవాలి. పాత ఇండ్లు, శిథిల ఇండ్లలో ఉండరాదు. లోతట్టు ప్రాంతాల్లో ఉండవద్దు. రిస్క్ ప్రయాణాలు చేయవద్దు.
వాహనాలు రోడ్ల పై జారుతాయి కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు, వృద్దులు బయటికి రావద్దు. ప్రాజెక్టులు, నీటిప్రవాహ ప్రాంతాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొండల వంటి ప్రాంతాలకు వెళ్లవద్దు. చెట్ల కింద ఉండవద్దు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూల్, హాస్టళ్లలో విద్యార్దులకు సమస్యలు రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీళ్లు తాగాలి. చల్లని పదార్దాలకు దూరంగా ఉండాలి. నగరాల్లో మ్యాన్ హోల్స్ ఉంటాయి కావున చూసి నడవాలి.