వైసీపీ ప్లీనరీ విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వంశీకృష్ణ యాదవ్‌లతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ ఫిలాసఫీ విషయానికి వస్తే.. సకల జనుల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల శ్రేయస్సే లక్ష్యంగా ఈ సమావేశాల్లో నిర్ణయాలు జరిగాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మహిళా సాధికారతే వైయస్సార్ సీపీ లక్ష్యంగా, అది మంత్రివర్గ కూర్పు నుంచి ప్లీనరీలో మాట్లాడిన వక్తల వరకూ క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థం అవుతుంది. అణగారిన వర్గాలకు, మహిళలకు 70శాతం వరకూ అవకాశాలు ఇవ్వడం, స్పీకర్, మండల చైర్మన్ తదితర పదవులు అన్నీ అణగారిన వర్గాలకు ఇవ్వడం రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథమం అని విజయ్ సాయి రెడ్డి తెలియజేసారు.