దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు నదుల్లోకి భారీగా నీరు వచ్చి చేరటంతో పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నాసిక్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నాసిక్‌లో పలు ఆలయాలు నీటమునిగాయి. నదికి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa