ఆంధప్రదేశ్‌లో విద్యార్థుల కోసం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకం తీసుకొచ్చింది. విదేశీ విద్యను అభ్యసించే అర్హులైన వాళ్ల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’పై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకం లాగే.. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేసేలా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ఇకపై వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించనుంది. నాలుగు వాయిదాల్లో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్. ల్యాండింగ్ పర్మిట్ లేదంటే ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు జమ చేస్తుంది ప్రభుత్వం. ఫస్ట్‌సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు ఉంటుంది. అలాగే.. రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్ లేదంటే ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు ఉంటుంది. ఐతే ఇది ఇదివరకు ప్రభుత్వమైనా టీడీపీ ప్రవేశపెట్టిన పధకం అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.