బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా నకిలీదారులకు షాకిచ్చింది. భారత్‌లో సుమారు 47,624 ఫేక్ ఖాతాలపై నిషేధం విధించింది. బీజీఎమ్ఐ యూజర్లకు ఆహ్లాదకరమైన గేమింగ్ అనుభూతిని అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రాఫ్టన్ సంస్థ తాజాగా తెలిపింది.
కొంతమంది ఖాతాదారులు థర్డపార్టీ ప్రోగ్రామ్‌ల ద్వారా యూజర్ల డేటా మార్చడం, నకిలీ ఐడీలను ఉపయోగించడం, గేమ్‌లో టీమ్ సభ్యులను మోసగించడం వంటివి చేస్తున్నారని తెలిపింది.