1993 ముంబై పేలుళ్ల కేసులో గ్యాంగ్‌స్టర్ అబుసలేమ్ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి విడుదలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పోర్చుగీసు ప్రభుత్వానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని పేర్కొంది. 2002లో తనను అప్పగించే క్రమంలో శిక్షాకాలం 25 ఏళ్లకు మించదని పోర్చగల్‌కు ఇండియా హామీ ఇచ్చిందని, సలేమ్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చాడు. అతడి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.