శ్రీలంకలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. లీటర్ పెట్రోల్ రూ.500కి చేరింది. లీటర్ పెట్రోల్ కోసం వారం రోజులు క్యూ కట్టాల్సి వస్తుంది. బ్లాక్ లో లీటర్ పెట్రోల్ రూ.2000కి అమ్ముతున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీలంక ప్రజలు ఆందోళన చేయడంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంకలో ప్రభుత్వమే లేదు. దీంతో అక్కడ ఆర్దిక పరిస్థితులు దిగజారాయి.