పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్ట్ 48 గేట్లని అధికారులు ఎత్తివేశారు. పోలవరం ప్రాజెక్ట్ నుండి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నానికి 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వరద ఉద్ధృతితో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి .ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 32. 2 మీటర్ల చేరుకున్న గోదావరి నీటిమట్టం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి భారీ వరద గంట గంటకు పెరుగుతుంది.