భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తరుణంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. ఇది 19 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు చేయనున్నారు. ఇదే గనుక జరిగితే కోనసీమలోని పలు గ్రామాలు నీట మునుగుతాయనే ఆందోళన ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa