రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సరికొత్త నిర్వచనం చెప్పారు. టీడీపీ మరోసారి బీజేపీకి మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం, మోసం చేసిన బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వడం దారుణమన్నారు. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని.. ప్రత్యేక హోదాకు పంగనామం పెట్టిందన్నారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ సంగతి ఏమైందని ప్రశ్నించారు. బీజేపీకి టీడీపీ మద్దతివ్వడం రాష్ట్రానికి ద్రోహమే అవుతుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అంటూ సరికొత్త నిర్వచనం చెప్పారు.