ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే కోట్టరెడ్డి శ్రీధర్ రెడ్డిని కదిలించిన చిన్నారి గుండె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 09:00 PM

చిన్నారులు ఎంతటి వారినైనా కదిలించేస్తారటా. అలాంటి ఓ చిన్నారి గుండె ఏకంగా ఓ ఎమ్మెల్యే మనస్సును కదిలించేసింది. నెల్లూరు రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామానికి చెందిన పొట్లూరు స్నేహ అనే గిరిజన బాలిక గుండెలో రంధ్రంతో బాధపడుతోంది. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించగా, ఈ చిన్నారి అనారోగ్యం విషయం ఆయన దృష్టికి వచ్చింది. స్నేహ తల్లిదండ్రులు పేదవాళ్లని స్థానిక నేతలు ఎమ్మెల్యేకి వివరించారు. బాలిక తల్లితండ్రులు కూడా తమ దీనస్థితిని కోటంరెడ్డికి విన్నవించుకున్నారు. దాంతో ఆయన చలించిపోయారు. 


తిరుపతిలోని పెద్దాసుపత్రిలో ఆ బాలిక చికిత్సకు ఏర్పాట్లు చేయించారు. ఓ కారు ఏర్పాటు చేసి, తన ప్రతినిధిని కూడా బాలికతో పాటు తిరుపతి పంపించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. కాగా, ఆ బాలిక గుండెకు వైద్యులు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయగా, విజయవంతమైంది. ఈ విషయం తెలిసి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే బాలిక డిశ్చార్జి అయింది. ఆ చిన్నారితో కలిసి తల్లిదండ్రులు కోటంరెడ్డి ఆఫీసుకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com