సెజ్ ఏర్పాటులో పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారంటూ విశాఖ పరిధిలోని హెటిరో సెజ్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ.6.95 కోట్ల భారీ జరిమానాను విధించింది. ఈ మేరకు ఎన్జీటీ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో ఫార్మా సెజ్‌ను ఏర్పాటు చేసిన హెటిరో సంస్థ పర్యావరణ అనుమతులను పాటించలేదంటూ స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఎన్జీటీ... దీనిపై విచారణ చేయాలంటూ ఓ సంయుక్త కమిటీని నియమించింది. సదరు కమిటీ సమగ్ర విచారణ చేపట్టి... 311 పేజీల నివేదికను బుధవారం ఎన్జీటీకి అందజేసింది. అంతేకాకుండా పర్యావరణ అనుమతులను ఉల్లంఘించిన హెటిరోకు రూ.6.95 కోట్ల జరిమానాను విధించాలని ఎన్జీటీకి కమిటీ సిఫారసు చేసింది.