అన్నా డీఎంకే పార్టీ నుంచి పన్నీర్ సెల్వం కుటుంభాన్ని మొత్తంగా బహిష్కరిస్తూ పళనీస్వామి నిర్ణయం తీసుకొన్నారు. దీంతో పన్నీర్ సెల్వంకు సొంత పార్టీ అన్నాడీఎంకేలో వరుస షాక్ లు ఎదురయ్యాయి. పన్నీర్ పై అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఇప్పటికే వేటు వేశారు. తాజాగా ఆయన మరో షాకిచ్చారు. పన్నీర్ సెల్వం కుమారులు సహా మరో 16 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ, వీరంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ కారణం వల్లే వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో, పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి వెళ్లిపోయాయి. వెంటనే పన్నీర్ సెల్వంను పార్టీ పదవులతో పాటు, సభ్యత్వం నుంచి కూడా తొలగించారు.