చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలోని దేశిరెడ్డిగారి పల్లెలో 2 నెలల క్రితం వీచిన గాలులకు ట్రాన్స్ఫార్మర్ సహా విద్యుత్ స్తంభం కూలిపోయింది.
అయినా ట్రాన్స్కో సిబ్బంది పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని పొలాలు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరలో సమస్యలు పరిష్కరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa