ఇటీవల ఎగువున కురిసిన వర్షాలకు నాగావళి నది పొంగిపొర్లడంతో నది తీర ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గండ్రేడు, పనసపేట, వాల్తేర్ గ్రామాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో నదిలో పడవ ప్రయాణం చేయవలసి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం నాగావళి నదిలో నీరు అధికం కావడం తో నదీ తీర ప్రాంత వాసులైన గండేరు బెలమాం, దూసి, బలసలరేవు నుండి పడవలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు నదీ తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తూ గ్రామాల్లో దండోరా వేయించారు.