ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి స్పీడ్ బ్రేకర్ పై నుండి తన వాహనాన్ని అతివేగంతో దాటిస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురై వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన శృంగవరపుకోట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పని ముగించుకొని శృంగవరపుకోట నుండి తన స్వగ్రామమైన చింతాడకు వెళ్తున్న నేపథ్యంలో వినాయక పల్లి గ్రామ సమీపంలో గల స్పీడ్ బ్రేకర్ ను దాటిస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 వాహనానికి సమాచారం అందించారు. అప్పటికే 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో స్థానికులు సమాచారం మేరకు క్షతగాత్రుడి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.