కుప్పం మున్సిపాలిటీలోని తంబిగానపల్లి గ్రామానికి చెందిన ఉమా అనే మహిళ పొట్టకూటికోసం పట్టణంలో ఫ్యాక్టరీలో పని చేస్తోంది. శుక్రవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా బీసీఎన్ కళ్యాణ మండపం వద్ద పాల ఆటో వేగంగా వచ్చి రోడ్డు పక్కన వెళుతున్న ఉమా ను ఢీ కొట్టింది.
కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ శనివారం మృతి చెందింది. పోలీసులు ఆటో డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.