మనం చేసే చిన్నపాటి తప్పులే ఒక్కోసారి మనల్నీ పాతళంలోకి నొట్టేస్తాయి. ఇదిలావుంటే బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునక్ అడ్డంగా బుక్కయ్యారు. చిన్న తప్పుతో నెటిజన్లకు దొరికిపోయారు. దాంతో అందరూ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెటైర్లు పడుతున్నాయి. యూకే ప్రధాని పదవికి పోటీ చేస్తున్న సునక్ రెండో రౌండ్‌లో అత్యధిక ఓట్లను గెలుచుకుని టాప్‌లో నిలిచారు. అయితే ఇటీవల ఆయన తన ప్రచార బ్యానర్‌లో తప్పుగా రాశారు.
మొదటి టెలివిజన్ డిబెట్‌లో పాల్గొన్నప్పుడు రిషి సునక్ ప్రచార బ్యానర్‌లో క్యాంపెయిన్ స్పెల్లింగ్ తప్పు రాశారు. దాంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. కామెంట్ల వర్షం కురిపించారు. బిలియనీర్‌కు క్యాంపెయిన్ అనే పదం సరిగ్గా రాయలేకపోయారని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. చాలామంది అలాంటి కామెంట్లు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఫోకస్ మొత్తం రిషి సునక్‌పై పడింది. ఫలితంగా గూగుల్ ట్రెండింగ్‌లో కూడా సునక్ పేరు నిలిచింది.
అయితే నెటిజన్ల యాక్షన్‌కు రిషి సునక్ రియాక్ట్ అయ్యారు. చాలా హుందాగా సమాధానం ఇచ్చారు. తన స్లోగన్ రడీ ఫర్ రిషి లాగా...రడీ ఫర్‌స్పెల్ చెక్ అంటూ రిప్లై ఇచ్చారు. తన తప్పును గుర్తించడమే కాదు.. సరిదిద్దుకునేందుకు రెడీ అయ్యారు. కాగా ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాకు అంగీకరించారు. బోరిస్ జాన్సన్ చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో సొంత పార్టీ అభ్యర్థులను వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దాంతో వారంతా వరసగా రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో బోరిస్ జాన్సన్‌కు రాజీనామా అనివార్యం అయింది.
ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ జరుగుతుంది. ఆ పోస్ట్ కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్‌తో సహా మరో ఐదుగురు పోటీ పడుతున్నారు. అయితే రిషి సునక్ మొదటి రౌండ్‌లో నాలుగింట ఒక వంతు ఓట్లను సాధించి, రెండో రౌండ్‌లో మూడు అంకెలకుపైగా సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ప్రచారంలో భాగంగా వీకెండ్ టీవీ డిబేట్లలో ప్రత్యర్థులు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, టోరీ బ్యాక్ బెంచర్ టామ్ తుగెన్‌ధాట్‌లతో రిషి సునక్ పాల్గోనున్నారు.