కూరలో, పోపులో కనిపించే కరివేపాకును చాలా మంది పక్కన పడేస్తుంటారు. అయితే వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్-ఎ, విటమిన్-సి, కాపర్, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
ఖాళీ కడుపుతో రోజూ ఉదయాన్నే కరివేపాకును తింటే మలబద్ధకం సమస్య దరి చేరదు. కరివేపాకును పచ్చడి, పొడిగా చేసుకుని తింటుంటారు. ఇలా చేస్తే కాంతులీనే చర్మం మీ సొంతం అవుతుంది. జుట్టుకు పోషకాలు చేకూరుతాయి.