దివ్యాంగుల వెతలు.. దీనగాథలు జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ ని కదిలించాయి. ఎంతో దూరం నుంచి.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చిన వారు తమ సమస్యలను జనసేనాని దృష్టికి తెచ్చి, వాటికి ఓ పరిష్కార మార్గం చూపాలని దీనంగా వేడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రోత్సాహం లేదని, సమస్యలు చెప్పుకున్నా స్పందన లేదని, తమను మనుషులుగా కూడా గుర్తించడం లేదంటూ దివ్యాంగులు వాపోతున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరంలో నిర్వహించిన జనవాణి - జనసేన భరోసా కార్యక్రమానికి దివ్యాంగులు అధిక సంఖ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ కి తమ సమస్యలను చెప్పుకున్నారు. వేదికపైకి రాలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగుల వద్దకు నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్లి వారి సమస్యలను విన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa