మనదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే కొన్ని రాష్ట్రాలకు స్వల్ప భూకంపాలు సైతం వణికిస్తున్నాయి. మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని మోయిరాంగ్‌కు తూర్పు-ఆగ్నేయంలో శనివారం రాత్రి 11:42 గంటలకు భూమి కంపించడంతో ప్రజలకు అందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం లోతు 94 కి.మీ.గా ఉందని చెప్పింది. అంతకుముందు ఈ నెల 5న అస్సాంలో రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 11:03 గంటలకు సంభవించిన భూకంపం యొక్క లోతు 35 కి.మీ. గా ఎన్సీఎస్ గుర్తించింది. దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎన్సీఎస్ భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa