షుటింగ్ అంటేనే భయపడే పరిస్థితికి తెలుగు పరిశ్రమ నిర్మాతలు వచ్చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మరో సంక్షోభం నెలకొన్నట్టు కనిపిస్తోంది. సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలు నిలిపివేసేలా కార్యాచరణ సిద్ధమైనట్టు తెలుస్తోంది. సినిమాలపై నిర్మాణ వ్యయం, ఓటీటీల ప్రభావం పడుతోందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం నిర్మాతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమా షూటింగులు నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.