అనంతపురం, హిందూపురం: కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధుపడుతున్న లింగమ్మ (56) అనే మహిళ జీవితంపై విరక్తి చెంది నీటికుంటలోపడి ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం అబ్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీం తెలిపారు. వెంకటాపురం గ్రామానికి చెందిన బలిజ లింగమ్మ కొన్నేళ్లుగా దీర్ఘ కాలికవ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుందని భర్త అశ్వర్ధప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.