ప్రభుత్వాన్ని గద్దె దించే అధికారం సైన్యానికి మాత్రమే ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి సైన్యం మద్దతును ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా సైన్యం సరైన దిశలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa