పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరో ఇద్దరు యువ ఎంపీల మధ్య కూర్చొని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇద్దరు ఎంపీలు మరెవరో కాదు.. ఒకరు బీజేపీ తరఫున ఢిల్లీ నుంచి ఎంపీగా కొనసాగుతున్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, మరొకరు పంజాబ్ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa