ఫార్చూన్ బ్రాండ్‌పై వివిధ వంట నూనెల ధరలు తగ్గాయి. దీనిపై ఫార్చూన్ బ్రాండ్ మాతృ కంపెనీ అదానీ విల్మార్ సంస్థ తాజాగా నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలు తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ విల్మార్ సంస్థ ఎండీ, సీఈఓ అంగ్షు మల్లిక్ తెలిపారు. లీటర్ సోయాబీన్ ఆయిల్‌పై రూ.30, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ.11, వేరుశనగ నూనెపై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి.