ఇప్పటికే కరోనా, మంకీపాక్స్‌తో అల్లాడుతుండగా మరో కొత్త వైరస్ వెలుగులోకొచ్చింది. ఆఫ్రికా దేశమైన ఘనాలో 2 'మార్బర్గ్' వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల మరణించారు. ఎబోలా తరహాలోనే ఇది ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ఫలితాలను ధ్రువీకరించుకునేందుకు మరోసారి సెనెగల్‌లోని ల్యాబ్‌కు శాంపిళ్లు పంపినట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.