కె కోటపాడు మండలంలో పులి సంచరిస్తుందని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇంతవరకు ఎవ్వరికీ ఈ పులి కనబడక పోయిన మూగ జీవాలను మాత్రము ఈపులి పొట్టన పెట్టుకుంది, గత కొన్ని రోజులుగా ఆ నోటా ఈ నోటా పులి సంచార ప్రచారము జరిగినా ఎవ్వరి కంట కనపడిన సందర్భాలు లేవు. మండలములో ఆర్లి గ్రామములో పులి సంచరిస్తున్ననట్లు సమాచారాము ఆటవి శాఖ అధికారులు లకు చేరడంతో అది సంచరించిన ప్రదేశాలను కొంత వరకు గుర్తించిన పులి సంచారం నిజమేనా అన్న సందేహము ప్రజల్లోవుంది.
జనాలకు పశువులకు ఎక్కడ హాని జరగపోవడముతో పులి లేదని ఆగ్రామ చెందిన ప్రజలు భావించిన తరుణంలో ఆర్లే గ్రామానికి చెందిన చింతపాలేములొ దుక్కిట ఎద్దు మరణించిన తీరు చూసి కచ్చితంగా ఈ ప్రాంతములో పులి సంచరిస్తుందని ప్రచారము ఒక్కసారిగా దావాణంలా పాకడముతో ప్రజలు భయాందోళనకు గురియ్యారు. మూగ జీవాలను రుచి చూసిన పులి మనుషులపై తప్పకుండా దాడి చేస్తుందని, అటవీ శాఖ అధికారులు ప్రాణ నష్టము జరగకుండా ఉండేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని పలువురు కోరుచున్నారు.