నరసన్నపేట మండలంలోని గోపాలపెంట వంశధార నదిలో ఇసుక తవ్వకాల్లో బయటపడిన అమ్మవారి రాతి విగ్రహం పోలీస్ స్టేషన్ కు చేరింది. పంచాయతీ కార్యదర్శి పి. గిరిబాబు, వీఆర్వో బి. దామోదరావులు ఆ విగ్రహాన్ని పోలీసులకు సోమవారం ఉదయం అప్పగించారు.
పురావస్తు శాఖ అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత విగ్రహాన్ని ఏం చేయాలనేది నిర్ణయిస్తామని నరసన్నపేట ఎస్ఐ సింహాచలం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa