సారవకోట మండలంలోని కిడిమి గ్రామానికి చెందిన బండి యశోదకు సోమవారం రాత్రి తీవ్ర గాయాలయ్యాయి. భర్త చిన్నారావుతో కలిసి ఆమె ద్విచక్రవాహనంపై అలుదు వెళ్లి తిరిగి కిడిమికి వస్తుండగా జమచక్రం సమీపంలోని గిన్ని చెరువు వద్ద కుక్కలు వెంటపడ్డాయి.
ద్విచక్రవాహనం వెనక కూర్చొన్న యశోద కాలు కరవడంతో ఆమె జారి కిందపడటంతో తలకు, కాలికి గాయాలయ్యాయి. కొత్తపల్లి పీహెచ్సీకి తరలించి వైద్యమందించారు.