ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలతో వివాహిత అదృశ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 09:00 AM

నాతవరం మండలం వెదురు పల్లి గ్రామం నుంచి ఈనెల 13న వివాహిత అనసూయ ఇద్దరు పిల్లలతో అదృశ్యం అయింది. ఈ మేరకు ఆమె బంధువులు నాతవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెదురుపల్లి గ్రామానికి చెందిన అనసూయకు కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామానికి చెందిన రమేష్ తో 2012 వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.


వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనేపాథ్యంలో అనసూయను భర్త రమేష్ ఈనెల 13న వెదురుపల్లి గ్రామం తీసుకొచ్చి వదిలి వెళ్ళిపోయాడు. వెంటనే అనసూయ పిల్లలు తీసుకుని అదృశ్యం అయింది. వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో నాతవరం పోలీస్ స్టేషన్ లో బంధువులు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com