రూపాయి విలువ మంగళవారం ఉదయం రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.80.05 కి చేరింది. గత కొన్ని రోజులుగా రోజురోజుకి రూపాయి విలువ మరింత క్షీణిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి వెళ్లాయి. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.