ఓ సౌర తుపాను భూమివైపు వేగంగా దూసుకొస్తోందని అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. ఇది జూలై 20, 21 తేదీల్లో భూమిని తాకే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో జీపీఎస్ తో పాటు రేడియో, మొబైల్ సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సూర్యుడి ఉపరితలంలో జూలై 15న మొదలైన ఈ సౌర తుపాను గంటకు లక్షల కి.మీ వేగంతో ప్రయాణిస్తోందని చెప్పారు. ఈ సౌర తుపానును నాసా శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు.