కేంద్ర ప్రభుత్వం ఇంధన రవాణాపై విండ్‌ఫాల్ పన్నును తగ్గించింది. లీటర్ పెట్రోల్ ఎగుమతిపై ఉన్న రూ.6 పన్నును పూర్తిగా రద్దు చేసింది. విమానం ఇంధనంపై పన్నును రూ.6 నుంచి రూ.4 కు, లీటర్ డీజిల్ ఎగుమతిపై పన్నును రూ.13 నుంచి రూ.11 కు తగ్గించింది. ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును టన్నుకు రూ.23,250 నుంచి రూ.17,000 కు తగ్గించింది. కొత్త రేట్లు జూలై 20 నుంచి అమల్లోకి వస్తాయని బుధవారం ప్రకటించింది.