కావలసిన పదార్థాలు:
* సోయా చంక్స్ (మీల్ మేకర్): 250 గ్రా,
* చీజ్ తురుము: 180 గ్రా,
* వెన్న: 50 గ్రా,
* యాలకుల పొడి: పావు టీస్పూన్,
* మిరియాల పొడి: అర టీస్పూన్,
* కార్న్ ఫ్లోర్: 10 గ్రా,
* ఫ్రెష్ మిల్క్ క్రీమ్: 150 మి.లీ,
* అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్,
వేయించిన:
* ఉల్లిపాయలు: 100 గ్రా,
* కొత్తిమీర: 10గ్రా,
* పచ్చిమిర్చి: నాలుగు,
* ఉప్పు: తగినంత.
తయారీ విధానం:
ముందుగా సోయా చంక్స్‌ను ఉడికించుకొని నీరు వంపేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఒక పాత్రలో చీజ్ తీసుకొని చేత్తో బాగా మెదిపి, అందులో ఫ్రెష్ మిల్క్ క్రీమ్, కార్న్ ఫ్లోర్, కొంచెం ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చీజ్ మిశ్రమంలో వేసి.. మొత్తం మిశ్రమాన్ని కలిపి సోయా చంక్స్‌కు బాగా పట్టేలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని, కబాబ్‌లా ఒత్తుకుని, పెనం మీద నూనె వేసి రెండువైపులా కాల్చుకుంటే చాలు. సోయా చీజ్ కబాబ్ రెడీ.