కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్: 100 గ్రా.,
మెంతికూర: ఒక కట్ట,
శనగపిండి: 100 గ్రా.,
పచ్చిమిర్చి: రెండు,
అల్లం వెల్లుల్లి: పావు టీస్పూన్,
ఉల్లిపాయ: ఒకటి,
కారం పొడి: ఒక టీస్పూన్,
ధనియాల పొడి: ఒక టీస్పూన్,
ఉప్పు: తగినంత,
నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రం చేసుకుని సన్నటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర, ముక్కలు చేసుకున్న మష్రూమ్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనెపోసి వేడయ్యాక పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పకోడీలు వేసి, బాగా వేయించుకుంటే సరి. మెంతి మష్రూమ్ పకోడి సిద్ధం.