డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకి క్షీణిస్తోంది. దీని ప్రభావం మనం దిగుమతి చేసుకునే వస్తువులపై పడనుంది. ఎల్ఈడీ టీవీల్లో వాడే స్క్రీన్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఏసీల్లోని కంప్రెషర్లు, ఫ్రిడ్జ్ విడిభాగాలు, బట్టల తయారీలో వాడే డైస్, రంగులు, కెమికల్స్, మెటల్ బటన్లు, లోగోలు, జిప్ లు, ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. విదేశీ విద్య భారం కానుంది. నెలవారీ ఖర్చులు, ఫీజులు పెరుగుతాయి.