రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ హోదాతో సమానంగా ఆర్టీఐ కమిషనర్లకు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపింది. 5ఏళ్ల పాటు పదవిలో ఉంటే నెలకు రూ. 2.25 లక్షల వేతనం. అఖిలభారత సర్వీసు అధికారులకు చెల్లించినట్టుగానే డీఏ, సీసీఏ చెల్లింపులు , ఆర్జిత సెలవులు , ఉచిత వసతి లేదంటే మూల వేతనంలో 24 శాతం హెచ్ఆర్ఏ చెల్లింపు, సొంత ఇంటిలో నివాసం ఉన్నప్పటికీ హెచ్ఆర్ఏను క్లెయిం చేసుకునే అవకాశం, వాహనానికి నెలకు రూ.60 వేలు, టెలిఫోనుకు రూ. 5 వేలు. చెల్లించనున్న ప్రభుత్వం.